యూట్యూబ్ ఏపీ గ్రామాలపై పడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందని ప్రతీ వ్యక్తిని అడుగుతున్నారు. ముఖ్యంగా రైతులను అడుగుతుంటే వారు ఈసడించుకుంటున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చాడని.. అమలు చేస్తాడని ఆశలు పెట్టుకున్నామని కానీ దారుణంగా మోసం చేశాడని ఆరోపిస్తున్నారు.
తాజాగా ఓ గ్రామంలోకి వెళ్లిన యూట్యూబర్ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని ప్రశ్నించాడు. దీంతో ఓ రైతు కక్కలేక మింగలేక చెప్పలేక.. చెబితే కేసులు పెట్టి లోపల వేస్తారని భయపడ్డారు. మరి నిరసన ఎలా తెలుపడం అని ఆలోచించాడు.
పక్కనే ధైర్యంతో ముందుకు వచ్చిన ఓ రైతు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేక ప్రసంసిస్తూ.. ‘ఏపీలో ఎవ్వరికీ సూపర్ 6 పథకాలు రాకపోయినా నాకు వస్తున్నాయి.. చంద్రబాబు నాకు సపరేట్ గా పంపిస్తున్నాడు.. నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి ఇస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడీ వీడియో బాగా పేలింది.