పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం నిర్వహించిన దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ శిబిరం అట్టుడికిపోయింది. పాలకొల్లు నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు ఎదురెన్నడని పరిస్థితిని ఎదుర్కొన్నారు. హామీలు అమలు చేయకపోవడంపై స్థానిక ప్రజలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెరిగిన ధరలు, పెండింగ్ పథకాలు, నెలలుగా వేచి ఉన్న పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలకు నిధుల లేకపోవడం, సూపర్ 6 హామీల అమలులో వైఫల్యం వంటి సమస్యలతో ప్రజలు మండిపడ్డారు. “ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంటి..? ఇప్పుడు వాటిని మర్చిపోతారా?” అంటూ కొంతమంది మహిళలు, యువకులు ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రిని నిలదీసే సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి వచ్చింది.
దివ్యాంగులకు పరికరాల పంపిణీకి వచ్చిన మంత్రి, సడెన్‌గా తలెత్తిన నిరసనలతో కంగారు పడ్డారు. ఆయనను లాగి మరీ జనాలు కొట్టారు. అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయే ప్రయత్నం చేసినా, కొంతమంది ప్రజలు మంత్రిని అనుసరిస్తూ తమ సమస్యలను నేరుగా వివరించే ప్రయత్నం చేశారు. దీంతో రసాభాష అయ్యింది.
ఈ ఘటనపై పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు స్పందిస్తూ.. “ప్రజలు తమ హక్కుల కోసం గొంతెత్తడం సహజం. కానీ ప్రభుత్వ హామీలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది, మంత్రులది” అని పేర్కొన్నారు.
ప్రజల స్పందనను చూస్తే, ప్రభుత్వం పునర్విమర్శ చేసుకొని, తన హామీల అమలులో వేగం పెంచాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పాలకొల్లు నియోజకవర్గంలో ఈ ఘటన రాజకీయ రీతిలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిందే.