Top Stories

పిఠాపురం వర్మ వైసీపీలోకీ..?

పిఠాపురం విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి? కనీసం అక్కడ వాయిస్ వినిపించేవారు లేరు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత పెద్దగా కనిపించడం లేదు ఎందుకు? పొలిటికల్ సర్కిల్‌లో ఇదే ఆసక్తికర చర్చ. 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు పెండెం దొరబాబు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన జనసేనలో చేరిపోయారు. దీంతో జనసేన బలమైన శక్తిగా ఎదిగింది. ఎందుకో వంగా గీత మాత్రం పెద్దగా స్పందించడం లేదు. పార్టీ కార్యక్రమాలను తూతూ మంత్రంగా చేపట్టి వదిలేస్తున్నారు. అయితే భవిష్యత్తు కార్యాచరణ దృష్ట్యా ఆమె వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది.

వంగా గీతది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలో చురుగ్గా పనిచేశారు. తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ సమయంలో మెగాస్టార్ కుటుంబంతో ఆమెకు మంచి సంబంధాలే నడిచాయి. వంగా గీత విషయంలో మెగా ఫ్యామిలీ కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. అయితే వైసీపీ హయాంలో కాకినాడ ఎంపీగా పనిచేశారు గీత. తరువాత పవన్ కళ్యాణ్‌పై అనూహ్య పరిస్థితుల్లో పోటీకి నిలబడాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో సైతం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థి వంగా గీత మంచి మహిళ అని.. ఎప్పటికైనా ఆమె జనసేనలో చేరడం ఖాయమని తేల్చి చెప్పారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో రెండు మూడు ఘటనలు జరిగాయి. కానీ వంగా గీత పెద్దగా స్పందించలేదు.

తాజాగా రాష్ట్రస్థాయిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు జరపాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ ఆందోళనలు జరగలేదు. తొలి రెండు రోజులు వంగా గీత నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించారు. కానీ 100కు మించి వైసీపీ కార్యకర్తలు హాజరు కాలేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు గీత భవిష్యత్తు విషయంలో ఒక ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. పిఠాపురం వర్మ విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భిన్న ప్రచారం చేస్తోంది. ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో వర్మ వైసీపీలోకి వస్తే తన పరిస్థితి ఏంటనేది గీతకు తలెత్తుతున్న అనుమానం. అందుకే పార్టీ కార్యక్రమాలను ఏదో తూతూ మంత్రంగా నిర్వహించాలన్న ఆలోచనతో ఆమె ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. లేనట్టేనని ఆ పార్టీ వర్గాలే చెబుతుండడం విశేషం.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories