ఏపీలో పుష్ప 2 సినిమా ట్రెండింగ్‌లో ఉంది. సినిమా ప్రదర్శింపబడే థియేటర్లలో జాతర నెలకొంది. మరోవైపు రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ చిత్రం కోసం సినిమా థియేటర్లలో ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. అల్లు అర్జున్‌కు మద్దతుగా వైసీపీ నేతలు జగన్ ఫోటోతో బ్యానర్లు కట్టారు. వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించిన అల్లు అర్జున్ కు ఇప్పుడు వైసీపీ నేతలు ఓన్ చేసుకొని సినిమాకు పోటెత్తుతున్నారు.. పుష్ప చిత్రం మేనియా ఇప్పుడు భారతదేశం అంతటా వినిపిస్తోంది. ప్రతి థియేటర్‌లోనూ అల్లు అర్జున్ అభిమానుల సందడి కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ పుష్ప2ను హైలెట్ చేస్తోంది. ఈ సమయంలో బన్నీ-జగన్ ఫ్లెక్సీ వివాదంగా మారింది.
తిరుపతి జిల్లా పాకాలలోని శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద వైసిపి నాయకులు చిత్రానికి మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్‌తో పాటు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్స్ పేపర్లను సిద్ధం చేశారు. ఫ్లెక్సీ లో బన్నీ వైసీపీ తాలూకా అంటూ రాసుకొచ్చారు. దీన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు.