Top Stories

బ్రహ్మానందంపై రెచ్చిపోయిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!

వయసు పెరుగుతున్నకొద్దీ మనిషి మాటల్లో, నడవడిలో మరింత పరిపక్వత కనిపించాలి. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న పెద్ద వ్యక్తులు ఒక్క మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం బాధ్యతగా భావించాలి. అయితే ఇటీవల నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ వరుసగా చూపిస్తున్న ప్రవర్తన ఈ మాటలకు పూర్తి విరుద్ధంగా మారుతోంది.

‘రాబిన్ హుడ్’ ఈవెంట్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై ఏమరపాటు వ్యాఖ్యలు చేసిన ఘటన ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చలకెందిస్తోంది. భారీ నెగిటివిటీ వెల్లువలా రావడంతో ఆయన వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత SV కృష్ణ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి కమెడియన్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. రెండోసారి కూడా ఆగ్రహంతో మాట్లాడి, మళ్లీ క్షమాపణలు చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇప్పటికీ ‘సహాకుటుంబానం’ ఈవెంట్‌లో బ్రహ్మానందంపై నోరు జారడం ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మరింత దెబ్బతీసింది. సభా సరస్వతికి ప్రణామమంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, వెంటనే సభా మర్యాదలకు విరుద్ధంగా మాట్లాడటం మరింత నిరాశపరిచింది. ఒకసారి అంటే పొరపాటు, రెండోసారి అంటే పాఠం నేర్చుకోలేదు అని భావించవచ్చు. కానీ మూడోసారి కూడా అదే జరుగుతుంటే… అది తప్పే అని అనిపించక మానదు.

రాజేంద్ర ప్రసాద్‌ అనే పేరు తెలుగు సినిమా పరిశ్రమలో గౌరవానికి ప్రతీక. ఆయన అందించిన నవ్వులు, హిట్ చిత్రాలు, నటించిన అద్భుత పాత్రలు ఎన్నటికీ మరువలేము. అలాంటి లెజెండరీ స్థాయిలో ఉన్న వ్యక్తి తన మాటల వలన రోజురోజుకూ గౌరవాన్ని కోల్పోవడం అభిమానులకు బాధ కలిగిస్తోంది.

మనం పెంచుకున్న భావోద్వేగ అనుబంధం కారణంగానే ఆయనపై కోపం కన్నా… జాలే ఎక్కువగా కనిస్తోంది. అనవసరమైన వ్యాఖ్యలు కాకుండా, తన స్థాయికి తగిన ప్రవర్తనతో మళ్లీ అందరి మనసులో స్థానాన్ని నిలబెట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories