ఇంకా రెండు రోజుల్లో స్టార్ మా లో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ కోసం ప్రేక్షకులలో ఆసక్తి ఊపందుకుంది. ఈ సీజన్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనుండగా, అందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామన్ పీపుల్ ఉంటారు.
సెలబ్రిటీలలో అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తున్న పేరు రాము రాథోడ్. యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడుతూ సెన్సేషన్ సృష్టించిన ఈ గాయకుడు, ‘రాను బొంబాయికి రాను’, ‘సొమ్మసిల్లి పోతున్నావే’ పాటలతో కోట్లాది ప్రేక్షకులను అలరించాడు. ఈ పాటలకు వందల కోట్ల వ్యూస్ రావడం ద్వారా ఆయన పేరు, ఆదాయం రెండు రెట్లు పెరిగాయి.
ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న రాము రాథోడ్ కు, ఒక్కో వారానికి రూ. 3 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే రోజుకి సుమారు రూ. 40 వేల పైగా వస్తుందన్నమాట.
సంగీతంలో ఇప్పటికే సొంత స్థానాన్ని సంపాదించిన రాము, తన విలువైన సమయాన్ని బిగ్ బాస్ కోసం కేటాయించడం పట్ల నెటిజెన్స్ చర్చిస్తున్నారు. ఆయన ఎంట్రీ షోకి కొత్త రంగులు పూయనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.