జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా పేరొందిన రేణు దేశాయ్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. వీధి కుక్కల హత్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
“మగాళ్లు రేప్ చేస్తారు… మగాళ్లు మర్డర్ చేస్తారు… మరి వాళ్లను ఏమి చేయాలి?” అంటూ ఆగ్రహంగా ప్రశ్నించిన రేణు దేశాయ్, కుక్కలపై ద్వేషంతో హింసకు దిగేవారికి “బుద్ధి ఉందా?” అని తీవ్రంగా మండిపడ్డారు. జంతువులపై హింసను సమర్థించే ఆలోచనలే ప్రమాదకరమని, సమాజం మానవత్వాన్ని కోల్పోతేనే ఇలాంటి చర్యలు పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్యగా మాత్రమే కాకుండా, స్వతంత్రంగా తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందిన రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల మధ్య తీవ్ర వాదనలకు కారణమవుతున్నాయి. జంతు హక్కుల పరిరక్షణపై ఆమె తీసుకున్న స్థానం మళ్లీ ఒకసారి దేశవ్యాప్తంగా చర్చను రగిలించింది.


