వీడియోతో అడ్డంగా బుక్.. రేవంత్ సార్ ను ఆడుకుంటున్నారే!

తేట తెలుగు తేనేలొలుకు.. మాతృభాషలో అందరికీ ఈజీగా అర్థమవుతుంది.. మాట్లాడగలరు.. కానీ పాపం ఇంగ్లీష్, హిందీ అంటేనే మనకు కష్టం. తెలంగాణ నిజాం పాలనలో ఉండడంతో పరభాషలోపాలు అందరిలోనూ కనిపిస్తున్నాయి. పాత తరానికి హిందీ అలవడినా ఇంగ్లీష్ ఇప్పటికీ చాలా మందికి రాదు. నేతలకు ఈ లోపం ఉంది.

నిజాం పాలనలో హిందీ వాడుకలో ఉండడంతో అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్ లో మాట్లాడడం కష్టమైపోతోంది మన నేతలకు. మన చదువులు, వెనుకబాటు ఇందుకు కారణం. ఈ విషయంలో పాపం మన సీఎం రేవంత్ రెడ్డి గారు తడబాటు పడుతున్నారు.

దావోస్ పర్యటనలో ఆయనను ఇంగ్లీష్ జర్నలిస్టులు ఇంటర్వ్యూల పేరిట ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో రేవంత్ రెడ్డి ఇబ్బందిపడుతున్నారు. ఇంగ్లీష్ లో సమాధానాలు ఇవ్వలేక ఆపసోపాలు పడుతున్నారు.

ఇదే బీఆర్ఎస్ నేతలకు ఆయుధంగా మారుతోంది. ఆయన వీడియోలను ట్రోల్ చేస్తూ మా కేసీఆర్, కేటీఆర్ లకు ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చోనంటూ జబ్బలు జరుచుకుంటున్నారు. ఆంగ్లం రాని రేవంత్ సార్ ను ఆడిపోసుకుంటున్నారు. ఈ ట్రోల్స్ పై కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మా నేత జనంలోంచి వచ్చారని ఆయన అభివృద్ధి చేస్తే చాలంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి