ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా జర్నలిజంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి యూట్యూబ్ చానళ్ల పేరుతో కొంతమంది స్వయంసిద్ధ జర్నలిస్టులు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం, ప్రశ్నలు వేయడం, అసభ్యంగా మాట్లాడటం వల్ల నిజమైన పాత్రికేయులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు.
ఇవే అంశాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాలని రేవంత్ సూచించారు. ప్రస్తుతం ప్రధాన మీడియా రాజకీయ ప్రభావానికి లోనవుతూ ప్రజల నమ్మకాన్ని కోల్పోతుండగా, సోషల్ మీడియా వేదికగా స్వైరవాఖ్యలు చేసేవారు విపరీతంగా పెరిగిపోతున్నారు. వీరిని పూర్తిగా నియంత్రించడం కష్టమేనన్నది వాస్తవం.