మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి ఛానెల్‌ను సీక్రెట్‌గా 24×7 చూస్తున్నారట టీవీ5 యాంకర్ సాంబశివరావు, ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ!” అంటూ సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఎందుకంటే ఇటీవల టీవీ5 , ఏబీఎన్ చానెల్స్ లో సాయంత్రం జరిగే రాజకీయ చర్చల్లో ఇద్దరూ కూడా “సాక్షి” ప్రసారాలను తరచూ ప్రస్తావిస్తూ, అందులో చూపిన విషయాలపై స్పందించడం గమనార్హం. దీంతో నెటిజన్లు మజాగా “సాక్షి అంత బాగుంటుందా బ్రో?” , “వాళ్ల ఓనర్స్‌కి తెలియకుండా 24 గంటలు సాక్షి చూస్తున్నారు అనుకో!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక సాక్షి ఛానెల్ మాత్రం ఎప్పటిలానే టీడీపీ–జనసేన కూటమి ప్రభుత్వంపై కఠిన విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలను ఎండగడుతోంది. ఈ నేపథ్యంలో టీవీ5, ఏబీఎన్ యాంకర్లు కూడా సాక్షి కవరేజ్ గురించి ప్రస్తావించడం వల్ల, “సాక్షి ప్రభావం వాళ్ల మీద పడిందేమో” అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
పాలిటికల్ సర్కిల్స్ లోనూ ఇదే చర్చ. “తమ ప్రోగ్రామ్స్ కంటే సాక్షి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు అనుకోండి!” అని వ్యంగ్యంగా చెబుతున్నారు.
ఇక ఈ వ్యాఖ్యలపై ఇద్దరు యాంకర్లు మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కానీ నెటిజన్ల ఊహాగానాలు మాత్రం సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి.
మొత్తానికి, ఆన్‌లైన్‌లోనైనా, ఆఫ్‌లైన్‌లోనైనా “సాక్షి” ఇప్పుడు ప్రతిపక్షం కంటే, ప్రతిస్పందకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది!