టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ ఒకసారి తన కామెడీ టాలెంట్ ప్రదర్శించారు. వైద్య విద్యలో ప్రైవేటీకరణ వద్దు అని వాదిస్తున్న వారిపై సాంబ గారికి విపరీతమైన కోపం వచ్చేసింది. వైసీపీ అధినేత జగన్ ప్రైవేట్‌పై “సొల్లు కబురు” చెబుతున్నారని ఆయన అరిచేశారు.
కానీ అసలు విషయం ఏమిటంటే ప్రజలకు వైద్య విద్య అందుబాటులో ఉండాలి అన్నదే ప్రధాన అంశం. ప్రజాస్వామ్యంలో, పేద పిల్లలు కూడా డాక్టర్ కావాలి అనే కల నెరవేర్చుకోవాలి. అదే సమయంలో, ప్రైవేటైజేషన్ అంటే పేదల కలలకు గీటురాయి. ఇలాంటి సమయంలో టీవీ5 సాంబ మాత్రం వాస్తవ సమస్యలు పక్కనపెట్టి, సీఎం చంద్రబాబు విధానాలకు మద్దతుగా బట్టలు చింపుకుంటూ వాదనలు చెబుతున్నారు.
PPP మోడల్ పేరుతో వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వదిలేయడం అంటే సాధారణ విద్యార్థులకు డాక్టర్ అవ్వడం కలగానే మిగిలిపోవడం. కానీ ఈ వాస్తవాలను చర్చించే బదులు, సాంబశివరావు వింత వింతగా వాదనలు చెబుతూ కామెడీ పంచుతున్నారు.
ప్రజల్లో ఇప్పుడు పెద్ద చర్చ వైద్య విద్యని అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పేవాళ్లు నిజం చెబుతున్నారా? లేక ప్రైవేటేజేషన్‌కు సపోర్ట్ చేస్తూ, “సొల్లు కబుర్లు” చెబుతున్న సాంబలాంటివాళ్లే నిజం చెబుతున్నారా?
ఈ కామెడీని చూసి ప్రజలు నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. ఒకప్పుడు ప్రైవేటైజేషన్ అన్నా ప్రతిఘటన చూపే వాళ్లు, ఇప్పుడు దానికి మద్దతుగా వాదనలు చేయడం చూసి – “ఇది కామెడీ కాదు మరి ఏమిటి?” అని ప్రేక్షకులు తలపట్టుకుంటున్నారు.