గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తి, భక్తి గీతాలు, ఊరేగింపులు, హారతులు, హోమాలు.. ఇలా పవిత్ర వాతావరణం అలవడాలి. కానీ ఆధ్యాత్మికతను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అసభ్యకరంగా “రికార్డింగ్ డ్యాన్స్” ప్రదర్శనలు నిర్వహించడం ఆందోళన కలిగించే విషయం.
తూర్పు గోదావరి జిల్లా నల్లజెర్ల మండలం, టెలికిచెర్ల గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. వినాయకుని శోభాయాత్ర పేరుతో నృత్యకారిణులను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతే కాదు ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ నేతలే ప్రోత్సాహం ఇచ్చారని గ్రామస్థుల ఆరోపణ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వైఖరిపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడాల్సిన సమయంలో ఇలాంటి అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించడం హిందూ సమాజాన్ని కించపరిచే వ్యవహారమేనని విమర్శకులు చెబుతున్నారు.
ఇక ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. రాజకీయ పార్టీలు ఓట్లు కోసం పండుగల పవిత్రతను కూడా వక్రీకరించకూడదన్నది ప్రజల అభిప్రాయం.
సనాతన ధర్మం ప్రదర్శన పేరుతో అసభ్యత, అశ్లీలత ప్రదర్శించడం నిజంగా సిగ్గుచేటు.