Top Stories

బాబోరి ‘లిక్కర్’ విజనా మజాకా.. చూసి నవ్వకుంటే ఒట్టు

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజనరీ పాలన సాగుతోంది. చంద్రబాబు నాయుడు గొప్ప విజన్ ఉన్న నాయకుడు అంటూ ఆస్థాన మీడియా గోబుల్స్ ప్రచారం ద్వారా ఒక బ్రాండ్ ను కట్టబెట్టారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు తన విజనరీ పాలనను మెచ్చుకుంటూ రెండోసారి అధికారాన్ని ప్రజలు కట్టబెట్టిన దాఖలాలు కూడా ఎప్పుడూ లేవు. అసలు పొత్తు లేకుండా విజయం సాధించడమే చంద్రబాబుకు తెలియదు.

అటువంటి నాయకుడిని విజనరీగా ఎస్టాబ్లిష్ చేసి ప్రజలపై రుద్దే ప్రయత్నాన్ని కొంతమంది మేధావి ముసుగులోని వ్యక్తులు, మీడియా సంస్థలు చేశాయి. అయితే అటువంటి చంద్రబాబు విజనరీ పాలనలో ప్రస్తుతం రాష్ట్రం అద్వాన్న దిశగా ముందుకు సాగుతోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు భారీగా రేట్లు పెంచడంతోపాటు షాపుల సంఖ్యను కూడా తగ్గించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్ని మారుస్తున్నామంటూ షాపుల సంఖ్యను భారీగా పెంచేశారు. గతంలో మద్యం వల్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. కానీ కూటమి నాయకుల జేబుల్లోకి మద్యం ఆదాయం వెళ్లేలా మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రస్తుతం ఆ షాపుల్లోనే మద్యం విక్రయాలు సాగుతున్నాయి.

అయితే మద్యం దుకాణాల్లో ప్రస్తుతం విక్రయిస్తున్న కొన్ని బ్రాండ్లు మందు బాబులను షాక్ కు గురిచేస్తున్నాయి. బాడీ స్ప్రేలకు, ఫ్రూట్ జ్యూస్ లకు ఉన్న పేర్లను మందులకు తగిలించి మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగిస్తున్నారు. బాడీ స్ప్రే కంపెనీకి చెందిన షాట్, ఫ్రూట్ జ్యూస్ పేరు అయినా ట్రోపికానా పేరుతో అనేక మద్యం దుకాణాల్లో మందు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్స్ విక్రయాలు చూసిన మందుబాబులు వాటే విజన్ బాబు అంటూ కొనియాడుతున్నారు. ఇటువంటి బ్రాండ్స్ ను తమ జీవితాల్లో చూడలేదంటూ మందుబాబులు చిల్ అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ మందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బాబోరి బ్రాండ్ అంటే ఇదే అంటూ పలువురు కామెంట్ చేస్తుండగా.. చంద్రబాబు గారి విజన్ కు తార్కాణం ఇదేనంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories