ఎవడ్రా నువ్వు.. ఇంత కామెడీ చేస్తున్నావ్!

ఈ మధ్య ఫ్రాంక్ వీడియోలు ఎక్కువపోయాయి. యూటూబర్స్ పతాకం వాటిమీదనే పడిపోయారు. అమాయకులను పట్టుకొని ఆడేసుకుంటున్నారు. అలాంటి ఒక ఘటననే తాజాగా చోటు చేసుకుంది. ఈ మధ్యన అందరు యూటూబర్స్ పల్లెల మీద పడిపోతున్నారు. కొంత మంది వృద్ధుల ముందు మైక్ పెట్టేసి ప్రభుత్వాలపై ఓపినియన్స్ అడుగుగున్నారు. వాళ్లు తిట్టిపోసే వీడియోలను వైరల్ చేస్తున్నారు.

తాజాగా ఓ పెద్దాయన ముందు మైక్ పట్టించి ఓ యూట్యూబర్ ఆటపట్టించాడు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. పొలానికి వెళుతున్న రైతును ఆపి.. ఈ పక్కన రాత్రి ఇద్దరు కొట్టుకున్నారని..ఒకరి హత్య జరిగిందని.. ఇది తెలుసా? అంటూ రైతును యూట్యూబర్ ప్రశ్నించాడు.

దీనికి ఆయన నాకు తెలియదండీ.. హత్య జరిగిందా? అంటూ అమాయకంగా ప్రశ్నిస్తాడు. దానికి యూట్యూబర్.. హత్యచేసింది ఈయనేనట.. చూడండి ఆ అవతారం లాగులు వేసుకొని గల్ల ఎగరవేసుకుంటూ వెళుతున్నాడని ఆయనే హత్యచేశాడు అన్నట్టు వీడియో చేస్తాడు. దీనికి బెంబేలెత్తిపోయిన రైతు భయంతో గందరగోళంగా కనిపిస్తాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి