Top Stories

యాడదొరికార్రా బాబూ.. షర్మిలకు ఇచ్చిపడేశారు.. వైరల్‌ వీడియో

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వైఎస్‌ షర్మిల కమెడియన్‌ పాత్రను పోషిస్తున్నారు. ఆమె మాట్లాడే మాటలు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఆమె తొలుత రాజకీయాలను ప్రారంభించేందుకు సిద్ధమైన సమయంలో తెలంగాణలో పార్టీని పెట్టారు. కొన్నాళ్లపాటు పాదయాత్ర చేసిన ఆమె ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో పార్టీని విలీనం చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌ మద్ధతు పలికారు. ఆ తరువాత ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె వైసీపీ అధినేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు సాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తరువాత కూడా ఇప్పటికీ ఆమె వైసీపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు, ఆయన సోదరుడు జగన్‌కు మధ్య ఆస్తిపరమైన వివాదాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో వైఎస్‌ షర్మిల తన సోదరుడైన జగన్‌ను అన్ని విధాలుగా ఇరకాటంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఇప్పటికే సామాజిక మాద్యమాలు వేదికగా ఆమెపై తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమైన తీరు పలు విమర్శలకు తావిచ్చింది. గతంలో చంద్రబాబు తరహాలో ఈమె కూడా ఏడుపుగొట్టు వ్యవహారాలతో సింపతీ పొందేందుకు యత్నిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. గతంలో అనేక సందర్భాల్లో షర్మిల మాట్లాడిన మాటలకు పలువురు విద్యార్థినులు సెటైరికల్‌ యాక్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఐదుగురు విద్యార్థినులు గతంలో షర్మిల మాట్లాడిన మాటలకు లయ బద్ధంగా శరీరాన్ని కదుపుతూ ఆమెను ఏకిపడేశారు. ఈ వీడియాలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంటూ ఒక యువతి వయ్యారంగా నడుస్తూ ఎద్దేవా చేయగా, మరో యువతి ఆడ పిల్ల పుట్టగానే ఆడ పిల్ల అంటారు. అంటే ఈడ పిల్ల కాదు ఆడ పిల్ల కాబట్టి ఆడ పిల్ల అంటారు అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పుడు మీ ఆవిడ మీ ఆవిడ అని ఎందుకంటున్నారో తెలుసా మీ ఆవిడ కాబట్టి, ఏడుసార్లు గొడ్డలితో తలమీద నరికి నరికి నరికి నరికి నరికి నరికి నరికి నరికి నరికి,
రెయినీ సీజన్‌ అంటేనే రెయిన్స్‌ వచ్చే సీజన్‌ కాబట్టి అంటూ షర్మిల వ్యాఖ్యలను ట్రోల్‌ చేస్తూ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. ఈ వీడియోకు అనేక కామెంట్లు వస్తున్నాయి. యాడదొరిక్రార్రా బాబూ అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, షర్మిల ఆడే మాటలన్నీ ఇలానే ఉంటున్నాయంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories