Top Stories

ఫ్లాప్ అని ఒప్పుకున్న ‘సేనాని’

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి విడుదల చేసిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైందని, ఈ చేదు నిజాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా రెండో రోజుకే అంగీకరించాల్సి వచ్చిందని వార్తలు వెలువడుతున్నాయి. “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ జనసేన కార్యకర్తలు, అభిమానులను ఉద్రేకపరిచి, విస్తృత ప్రచారం మధ్య విడుదలైన ఈ చిత్రం, రాజకీయ లబ్ది కోసమే తెరకెక్కించబడిందన్న ఆరోపణలు ఎదుర్కొంది.

సినిమాను కేవలం ఒక చిత్రంగా కాకుండా, దానికి రాజకీయ రంగు పులిమి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ‘వీరమల్లు’ చిత్రం కోసం తెలుగుదేశం కార్యకర్తలను సైతం వాడుకున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, రాష్ట్రంలోని ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం.

వాస్తవానికి, సినిమా బాగుంటే ప్రత్యేక ప్రచారం అవసరం లేదని, బాగోలేకపోతే ఎంత ప్రచారం చేసినా ప్రేక్షకులు థియేటర్లకు రారని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయినా సరే, పవన్ కళ్యాణ్ తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించుకుంటూ, “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ జనసేన కుర్రాళ్లను రెచ్చగొట్టి మరీ హడావిడి చేశారు.

మొదటి రోజు కేవలం అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రమే థియేటర్లలో సందడి చేయగా, సాయంత్రానికి వివిధ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఛానెళ్లలో వచ్చిన రివ్యూలు, చూసిన వారి మౌత్ పబ్లిసిటీ దెబ్బకు రెండో రోజుకే సినిమా అసలు రంగు బయటపడింది. విడుదల ముందు విస్తృత ప్రచారంతో మీసం మెలేసిన పవన్, ఇప్పుడు నీరసించి, వాయిస్‌లో తేడా వచ్చి, తాను పేద కుటుంబంలో పుట్టానని, హీరో అయ్యానని, రాజకీయ పార్టీ పెట్టానని, గెలుపు ఓటములు తనకు పెద్దగా లెక్కలేదంటూ బాధను అణచుకొని గాంభీర్యం చూపుతున్నారని పరిశీలకులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం సాఫ్ట్ అయిపోయి శ్మశాన వైరాగ్యం కబుర్లు చెబుతుండటంతో, ఈ ఫలితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా బాగానే గుణపాఠం అయిందని జనం భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫలితం జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories