Top Stories

తెనాలి యువతి హత్యకేసులో సంచలన వీడియో లీక్.. వైరల్

గుంటూరు జిల్లా తెనాలిలో మూడు రోజుల క్రితం ప్రేమించిన యువకుడి చేతిలో మృతి చెందిన సహనకు సంబంధించిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తలపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన యువతి చికిత్స పొందుతూ ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సహన మృతికి ప్రేమికుడు నవీన్ కారణంగా పోలీసులు నిర్ధారించారు. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం ఆమె హత్యకు కారణమైంది. ప్రస్తుతం నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా బహిర్గతమైంది. ఇందులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నవీన్ సహనపై దాడి చేసిన తర్వాత ముందుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడే యువతిని బెడ్ పై వేసి ఆసుపత్రిలోని సిబ్బందితో మాట్లాడాడు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో నవీన్ మరో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. సహనను ఆసుపత్రిలోకి నవీన్ ఒక్కడే తీసుకుని వస్తూ ఆ పుటేజీలో కనిపించాడు. అప్పటికే యువతి స్పృహలో లేని స్థితిలో ఉన్నట్టు కనిపించింది. తొలుత మెట్లుపైకి ఎక్కి లోపలికి తీసుకెళ్లిన యువకుడు ఆ తర్వాత మళ్లీ కిందకు తీసుకుని వచ్చినట్లు సిసిటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఆసుపత్రికి యువతని కారులో తీసుకువచ్చాడు. అక్కడ వైద్యుడు లేరని చెప్పడంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి నవీన్ పరారయ్యాడు. యువతి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించిన వైద్యులు చికిత్సను అందించారు. మెరుగైన వైద్యశాల అందించినప్పటికీ ఆమె మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం బహిర్గతమైనది. ఈ కేసులో కీలకమైన ఆధారంగా ఈ వీడియో ప్రస్తుతం నిలిచినట్లు పోలీసులు చెబుతున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories