Top Stories

వర్మకు షాక్.. పిఠాపురం ఇన్ చార్జిగా నాగబాబు

 

పిఠాపురం రాజకీయాల్లో వర్మ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయనకు తగిన గుర్తింపు లభించలేదనే భావన ఉంది. పవన్ గెలుపు కోసం ఎంతో శ్రమించినా అది పట్టించుకోలేదని, పైగా ఇటీవల అనుచిత వ్యాఖ్యల రూపంలో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను తన సోదరుడు నాగబాబుకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇది వర్మకు మరింత ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

గతంలో జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించేనని స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గెలుపు కేవలం ఆయన చరిష్మా వల్లే సాధ్యమైందని, పిఠాపురం ప్రజలే గెలిపించారని, ఇందులో ఇతరుల శ్రమ ఏమీ లేదని నాగబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

ఒకవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకున్న వర్మకు భవిష్యత్తులో అది దక్కే అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ సమయంలో మరో పార్టీలో చేరితేనే తనకు పిఠాపురం దక్కుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఆయన సిద్ధంగా లేరు. కానీ జనసేన నుంచి ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో కొనసాగడం కూడా కష్టంగా మారుతోంది.

ఇలాంటి క్లిష్ట సమయంలో, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా ఆ పదవిని చేపట్టనున్నారు. అయితే, ఆయనకు పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, వర్మకు మరింత అవమానం తప్పకపోవచ్చు.

ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరియు కీలక శాఖల మంత్రిగా బిజీగా ఉన్నారు. దీంతో నియోజకవర్గ బాధ్యతలను నాగబాబుకు అప్పగిస్తే, సమీక్షలు మరియు ఇతర కార్యక్రమాలన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఇది వర్మకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాకుండా, నియోజకవర్గంలో మెగా బ్రదర్స్ పట్టు మరింత బలపడుతుంది. దీంతో వర్మ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగితే ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది. కానీ పిఠాపురం నియోజకవర్గంపై ఆయన ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో, వర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అందుకే ఆయన ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం. టీడీపీలో ఉంటే ఎమ్మెల్సీ పదవితో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది, అలా ఉంటే నాగబాబు కింద పని చేయాల్సి వస్తుంది. మరోవైపు పార్టీని వీడటం గురించి కూడా ఆయన అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories