కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై గత ఏడాది లైంగిక వేధింపుల కేసు పెట్టి హాట్ టాపిక్‌గా మారిన శ్రేష్టి వర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమెకు ‘బిగ్ బాస్ 9’ లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కిందట.
బిగ్ బాస్ టీం ఇప్పటికే ఆమెతో ఇంటర్వ్యూ పూర్తి చేసి, వారానికి రెండు లక్షల రూపాయలకుపైగా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ మొత్తాన్ని గతంలో టీవీ యాంకర్లు, సీరియల్ ఆర్టిస్టులకు కూడా ఇవ్వలేదని టాక్.
ప్రస్తుతం జానీ మాస్టర్ సినిమాలతో బిజీగా ఉంటే, శ్రేష్టి వర్మ కూడా బిగ్ బాస్ హౌస్ ద్వారా కొత్త పాపులారిటీ సంపాదించబోతున్నట్టు కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఆమెతో పాటు అలేఖ్య చిట్టి, పికిల్స్ రమ్య కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని వినికిడి.
మరి ఈ సీజన్‌లో శ్రేష్టి వర్మ ఎంత హైలైట్ అవుతుందో చూడాలి.