సుగాలి ప్రీతి కేసు మరోసారి రాజకీయ వాదనలకు దారితీసింది. ఈ కేసుపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో ప్రతి సందర్భంలో ఈ కేసును ప్రస్తావించిన ఆయన, తాజాగా “ఇలాంటి కేసులు మాట్లాడితే తలనొప్పి వస్తుంది” అన్న వ్యాఖ్యలపై ప్రీతి తల్లి తీవ్రంగా స్పందించారు.
ఆమె మాట్లాడుతూ, “మేము మూడు నెలల్లో 11 సార్లు హైకోర్టుకు వెళ్లాం. ప్రతిసారి ముందు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్‌కి వెళ్లి ఆయనను కలవాలని కోరుకున్నాం. కానీ ఒక్కసారి కూడా ఆయన మమ్మల్ని కలవలేదు” అని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. నిజంగా ఆయన కేసు బాధితుల పట్ల నిజాయితీగా ఉన్నారా? లేక గతంలో రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని వినియోగించారా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం విపక్షాలు, సామాజిక వర్గాలు పవన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.