ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్ 9లో కమెడియన్ సుమన్ శెట్టి కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెడుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చాలా కాలంగా సినీ రంగంలో కనిపించలేదు.
అయినా బిగ్ బాస్ టీం ఆయనకు భారీ రెమ్యూనరేషన్ కేటాయించింది. ప్రతి వారం ఆయనకు రూ.1.75 లక్షలు చెల్లించనున్నట్టు సమాచారం. అయితే ఆడియన్స్‌తో మళ్లీ కనెక్ట్ కావాలంటే సుమన్ శెట్టి మొదటి ఎపిసోడ్ నుంచే తనదైన స్టైల్‌లో ఆకట్టుకోవాలి. లేకపోతే తొలి వారాల్లోనే ఎలిమినేషన్ అయ్యే ప్రమాదం ఉందని టాక్.
ఈ సీజన్‌లో సామాన్యులు కూడా కంటెస్టెంట్స్‌గా వస్తుండటంతో సుమన్ శెట్టికి ఇది నిజంగానే ఒక అగ్నిపరీక్షగా మారనుంది.