గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వివాదాస్పద ప్రవర్తనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళకు అసభ్యకరంగా వీడియో కాల్ చేసి రకరకాల జుగుప్సాకర సైగలు చేసిన సంఘటన నెట్టింట్లో వైరల్ కావడంతో టీడీపీ క్రమశిక్షణపై ప్రజల మద్దతు తీవ్రంగా దెబ్బతిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఓ మహిళతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ లో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళ తాను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో, నసీర్ అహ్మద్ తన కార్యాలయం నుంచి కాల్ చేసి ఆడపిల్లలందరినీ అవమానించేలా ప్రవర్తించాడని ఆమె చెప్పింది.
ఈ సంఘటనపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ‘‘ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండటం హేయం. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి,’’ అని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు నిరసనలకు పూనుకుంటున్నాయి.
వీడియో వైరల్ కావడంతో టీడీపీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ సంస్కారంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.”మీ టీడీపీ ఎమ్మెల్యేలకు మీరు నేర్పిన సంస్కారం ఇదేనా చంద్రబాబు? లోకేష్?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తమ నాయకులు నైతిక విలువలతో నడుచుకుంటారని ఆశించే ప్రజలు ఎమ్మెల్యే నసీర్ ప్రవర్తనపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రజా నైతికతను గౌరవించాల్సిన స్థానాల్లో ఉన్న నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యంపై దారుణమైన దాడిగా భావిస్తున్నారు.