Top Stories

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటన గుంటూరులో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.

కూటమి అపచారానికి వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలకు అంబటి రాంబాబు గోరంట్లకు వెళ్తుండగా, టీడీపీ గూండాలు ఆయన కారును అడ్డుకున్నారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ, దాడి యత్నానికి ప్రేక్షకులుగా మారారు. దీనిపై ఆగ్రహం చెందిన అంబటి మాట్లాడుతూ, “చంద్రబాబు అరచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులు టీడీపీ ఫ్లెక్సీలకు కాపలా కాస్తున్నారు. ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగింది” అని మండిపడ్డారు.

ఇది మాత్రమే కాదు, శుక్రవారం పల్నాడు జిల్లా బోయపాలెంలో మాజీ మంత్రి విడదల రజినీపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. తిరుమల లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ ఆమె గుడిలో పూజలు చేస్తుండగా, గుండాలు హల్‌చల్ సృష్టించి కారును ధ్వంసం చేయడానికి యత్నించారు. సీబీఐ విచారణలో లడ్డూలో జంతు కొవ్వు లేదని తేల్కపోయినా, టీడీపీ నేతలు రెచ్చిపోతూ వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు.

పోలీసుల తీరు, టీడీపీ గూండాయిజం పై వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ దాడులు ఆగకపోతే మరింత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories