ప్రముఖ యాంకర్, నటి అనసూయ మరోసారి తన ఘాటైన ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. ఇటీవల మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన అనసూయ, అక్కడ జరిగిన ఓ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె వారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
“చెప్పు తెగుద్ది.. ఎంత మంది ఉన్నా పట్టించుకోను, నేరుగా చెప్పుతో కొడతా” అంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీ ఇంట్లో అమ్మా చెల్లిని ఎవరైనా ఇలా ఏడిపిస్తే ఊరుకుంటారా?” అంటూ ఆమె వేసిన ప్రశ్న కూడా నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
అనసూయకి ‘ఆంటీ’ అన్న పదం నచ్చదని, దాన్ని ఉద్దేశపూర్వకంగానే కొందరు వాడుతున్నారని గతంలో ఆమె పలుమార్లు చెప్పారు. అదే తరహా వ్యాఖ్యలు అక్కడ వినిపించడంతోనే ఆమె రెచ్చిపోయినట్లు తెలుస్తోంది.
తన కెరీర్‌లో బుల్లితెరపై యాంకరింగ్‌తో స్టార్‌డమ్ అందుకున్న అనసూయ, ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలి కాలంలో “హరిహర వీరమల్లు” సినిమాలో కనిపించిన అనసూయ, ఇప్పుడు శక్తివంతమైన పాత్రలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేస్తోంది.