Top Stories

పిఠాపురం వర్మకు షాకిచ్చిన బాబు!

పిఠాపురం వర్మ సైలెంట్ అయ్యారా? లేకుంటే వేరే ఆప్షన్ లేక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? ఆయన వెనుక కుట్ర జరుగుతోందా? ఇంతకీ వర్మ వ్యూహమేంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో ఇదో చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా వర్మ పెద్దగా కనిపించడం లేదు. దీంతో అసలు వర్మ టీడీపీలో ఉన్నారా? లేరా అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. ఈ తరుణంలో వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని… తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని టీడీపీ నాయకత్వానికి సమాచారం అందింది. దీంతో టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఆయనను పిలిచి సముదాయించినట్లు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబును సైతం వర్మ కలవగా… అటు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ. 2019 నుంచి 2024 వరకు పిఠాపురం ఇన్‌ఛార్జిగా ఉండేవారు. టీడీపీ గెలిచే సీట్లలో పిఠాపురం ఒకటి. ఎన్నికలకు ముందు అటువంటి స్థానంపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా ఆ సీటు తనకు విడిచి పెట్టాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీంతో చంద్రబాబు ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో వర్మ తన పరిస్థితి ఏంటని అధినేత వద్ద మొరపెట్టుకున్నారు. అనుచరులు మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. కానీ అధినేత మంచి భవిష్యత్తు కల్పిస్తానని… అధికారంలోకి వచ్చిన మరుక్షణం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ హామీ లభించడంతో వర్మ మెత్తబడ్డారు. పవన్ కళ్యాణ్ కోసం గట్టిగానే కృషి చేశారు. కానీ ఇప్పుడు పిఠాపురం కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలతో వర్మకు ఎటువంటి అవకాశం లేకుండా పోతోంది.
ఇప్పటివరకు అనేకసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేశారు. వర్మ పేరు చివరి వరకు వినిపించేది. కానీ చివరి నిమిషంలో రకరకాల సమీకరణలు పేరు చెప్పి వర్మ పేరును తప్పించారు. అయితే రోజురోజుకు వర్మలో అసహనం పెరుగుతోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. జనసేనతో పొత్తు రాష్ట్రస్థాయిలో కావడంతో వర్మకు అధినేత నుంచి అంతగా సహకారం అందడం లేదు. దీంతో వర్మకు అసలు సిసలైన సినిమా కనిపిస్తోంది. అందుకే భవిష్యత్ కార్యాచరణ పై ఆయన దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగింది. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నారాయణ వర్మను ప్రత్యేకంగా పిలిపించి చర్చించారు. అధినేత ఇచ్చిన హామీ వెనుక ఉన్న కారణాలను వివరించే ప్రయత్నం చేశారు. అనంతరం అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అయితే వర్మకు చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేనని… ప్రత్యామ్నాయ పదవి కోరుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అయితే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కానీ… జిల్లా పరిషత్ చైర్మన్ కానీ వర్మకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికీ ఇప్పుడు ఇవ్వాలనుకుంటే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తారు. జడ్పీ చైర్మన్ పదవి కావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది.

Trending today

నట బీభత్స చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వై.ఎస్....

జస్ట్ 3 ఏళ్లే బాబు

  అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత...

వెంకటకృష్ణకు కోపం వచ్చింది

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్...

వైసీపీకి గొడ్డలి గుర్తు.. ఎల్లో మీడియా కుతంత్రం

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ గుర్తును మార్చుకోబోతోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా...

ఏబీఎన్ RK వాయిస్ వినిపించేది ఈమె!

ప్రతీ ఆదివారం తెలుగు ప్రజల చెవులను హోరెత్తించి, నిద్ర లేపి, అప్పుడప్పుడూ...

Topics

నట బీభత్స చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వై.ఎస్....

జస్ట్ 3 ఏళ్లే బాబు

  అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత...

వెంకటకృష్ణకు కోపం వచ్చింది

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్...

వైసీపీకి గొడ్డలి గుర్తు.. ఎల్లో మీడియా కుతంత్రం

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ గుర్తును మార్చుకోబోతోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా...

ఏబీఎన్ RK వాయిస్ వినిపించేది ఈమె!

ప్రతీ ఆదివారం తెలుగు ప్రజల చెవులను హోరెత్తించి, నిద్ర లేపి, అప్పుడప్పుడూ...

టీవీ5 సాంబ చరిత్ర తవ్వేశాడు

టీవీ5 సాంబశివరావు వ్యక్తిగత జీవితం, వృత్తి నేపథ్యంపై సంచలన ఆరోపణలు చేస్తూ...

టీవీ5 సాంబ ఫస్ట్రేషన్

మీరు ఊహించనటువంటి ఒక రహస్యం ఇప్పుడు బట్టబయలైంది! జగన్ సభలకు లక్షలాది...

పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్క?

పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు, రాజకీయ పరిశీలకులకు ఒక...

Related Articles

Popular Categories