Top Stories

రఘురామకు అసెంబ్లీలో అవమానం

ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ సీనియర్ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారును అధికారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. అక్కడున్న అధికారులపై మండిపడ్డారు.

మంత్రుల కాన్వాయ్‌ మాత్రమే లోపలికి అనుమితిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతమంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఇదే అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ కోరాలని తన లేఖలో కోరారు రఘురామ.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో తనకు పెద్ద పదవి వస్తుందని భావించారు రఘురామరాజు. స్పీకర్‌ పదవి తనదేనని చెప్పుకున్నారు. స్పీకర్‌ పదవి లేకపోతే కేబినెట్‌లోనైనా చోటు దక్కుతుందని భావించారు. కానీ, ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగానే ఉండిపోయారు.

నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రఘురామను చేర్చుకోవడానికి ఏ పార్టీ ఇష్ట పడలేదు. ముందుగా ఆయన బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. ఐతే రఘురామను చేర్చుకునేందుకు నిరాకరించిన బీజేపీ.. ఎంతో కాలంగా పార్టీకి విధేయుడుగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. అంతేకాదు కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కట్టబెట్టింది. ఇక చివరకు రఘురామకు టీడీపీ ఆశ్ర‌య‌మిచ్చింది. తర్వాత ఉండి టికెట్ కేటాయించడంతో అక్కడి నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories