Top Stories

బాలకృష్ణకు ‘మెంటల్ సర్టిఫికెట్’ కథ

 

ఒకానొక సమయంలో, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సంబంధించిన వార్తలను, చివరికి ఆయన సినిమాల ప్రకటనలను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించడం మానేసింది. ప్రకటనలు ఇవ్వకపోవడం వల్లే వార్తలు రావడం లేదని చాలా మంది భావించినప్పటికీ, అసలు కారణం వేరే ఉందని ఇప్పుడు వెల్లడైంది. ఈ విషయం ఇన్నాళ్లకు బయటపడటం, అది కూడా ఒక నెటిజన్ ద్వారా ఒక వీడియో వెలుగులోకి తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ తన ఛానెల్‌లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ పేరుతో ఒక టాక్ షో నిర్వహించేవారు. సమాజంలోని భిన్న వర్గాలకు చెందిన వ్యక్తులతో ముఖాముఖి నిర్వహించి, వారి జీవితాల్లోని తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేసేవారు. ఈ కార్యక్రమం ద్వారా గొప్పవారిగా వెలుగొందుతున్న వారి అసలు కోణాలు బయటపడేవి. కొన్ని సందర్భాల్లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ వివాదాస్పదంగా మారిన రోజులు కూడా ఉన్నాయి. అయితే, వేమూరి రాధాకృష్ణకు ఇటువంటివి కావాలి కాబట్టి, వచ్చిన అతిథులను అదే తరహా ప్రశ్నలు అడిగి నిజాలు రాబట్టేవారు. వేమూరి రాధాకృష్ణ ఇలా చిత్రమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టిన వ్యక్తులలో నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు ఒకరు. సుప్రసిద్ధ వైద్యుడిగా పేరుగాంచిన కాకర్ల సుబ్బారావు నిమ్స్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేశారు, కీలకమైన కేసులను డీల్ చేశారు. అలాంటి సుబ్బారావును వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు.

బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన జరిగినప్పుడు, బాలకృష్ణను నిమ్స్‌కు తరలించారు. ఆ సమయంలో బాలకృష్ణ ఇంట్లో ఒక నిర్మాత ఉన్నట్లు, ఆయనకు బుల్లెట్ గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన చాలా విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ సంఘటనను ‘షుగర్ కోటెడ్’ చేసి చూపించడానికి ప్రయత్నించగా, సాక్షి మాత్రం అసలు విషయాన్ని నిర్భయంగా ప్రచురించింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం నడుపుతున్నందున సాక్షి నిర్భయంగా రాసింది. ఈ విషయంలో సాక్షిని అభినందించవచ్చు. ఆనాటి సంఘటనలో బాలకృష్ణకు నిమ్స్‌లో వైద్యం చేసిన బృందానికి కాకర్ల సుబ్బారావు నాయకత్వం వహించారు. ఆనాటి ఘటనలో ఏం జరిగిందో తెలియదు కానీ, బాలకృష్ణను కాపాడటానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని కాకర్ల సుబ్బారావు ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పేర్కొన్నారు. రాధాకృష్ణ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా సుబ్బారావు సంచలన విషయాలను వెల్లడించారు.

“ఆనాడు బాలకృష్ణను కాపాడాలి. వేరే దారి లేదు. తప్పనిసరి పరిస్థితిలో మానసిక ధ్రువీకరణ పత్రం (మెంటల్ సర్టిఫికెట్) ఇవ్వాల్సి వచ్చిందని” సుబ్బారావు పేర్కొన్నారు. “మీరు ఇంత సహాయం చేశారు కాబట్టి తర్వాత మీ సేవలను గుర్తించారా?” అని వేమూరి రాధాకృష్ణ కాకర్ల సుబ్బారావును అడిగారు. “సహాయం అనే మాట పక్కన పెడితే… దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఆ ప్రస్తావన ఇక్కడ అనవసరం… తర్వాత చాలా జరిగిపోయాయని” సుబ్బారావు వ్యాఖ్యానించడంతో వేమూరి రాధాకృష్ణ ఆ టాపిక్‌ను డైవర్ట్ చేశారు.

కాకర్ల సుబ్బారావును వేమూరి రాధాకృష్ణ ఈ ప్రశ్న అడిగినప్పుడే బాలకృష్ణ క్యాంపుకు, ఆంధ్రజ్యోతికి మధ్య విభేదాలు మొదలయ్యాయని అంటుంటారు. రాధాకృష్ణ కూడా ఏమాత్రం తగ్గకుండా వ్యవహరించారు. దీంతో అటు బాలకృష్ణ, ఇటు వేమూరి రాధాకృష్ణ మధ్య “ఉప్పూ నిప్పూ” వ్యవహారం కొనసాగింది. ఫలితంగా చాలా రోజుల వరకు బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపించలేదు. తర్వాత ఎవరు మధ్యవర్తిత్వం వహించారో తెలియదు కానీ, చివరికి ఒక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఫలితంగా బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నాయి, బాలకృష్ణ విషయాలు ఏబీఎన్‌లో వినిపిస్తున్నాయి.

https://www.instagram.com/reel/DMVPEy-ocDK/?igsh=MXF6Z2RiNmdwcDlkMQ==

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories