బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ ఆదివారం గ్రాండ్ లాంచ్ తో ప్రారంభం కానుంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే — సామాన్యులకు కూడా హౌస్‌లో ప్రవేశం కల్పించడం. వేలాది దరఖాస్తుల నుంచి ఎంపికైన కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పటికే అగ్నిపరీక్ష టాస్క్‌లలో తమ ప్రతిభను చూపించారు.
జడ్జీల నిర్ణయంతో శ్రేయా, దమ్ము శ్రీజ, పడాల పవన్ కళ్యాణ్ నేరుగా హౌస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్. అలాగే ఓటింగ్ ద్వారా మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి లో ఎవరో ఒకరు హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.
సెలబ్రిటీల జాబితా కూడా ఆసక్తికరంగానే ఉంది. సీరియల్స్‌లో నటించిన భరణి, కమెడియన్ సుమన్ శెట్టి, జబర్దస్త్ ఇమ్మానుయేల్, నటీమణులు ఆశా షైనీ, తనూజ గౌడ, సంజన గిల్రాని, డెబ్జానీ, రీతూ చౌదరి లు హౌస్ లోకి రావడం ఖాయమని సమాచారం.
ఇక సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన అలేఖ్య చిట్టి, పికిల్స్ రమ్య మోక్ష, అలాగే జానీ మాస్టర్ కేసులో హైలైట్ అయిన శ్రేష్టి వర్మ కూడా ఈ సీజన్ లో భాగం కానున్నారు. అంతేకాదు, ప్రియాంక జైన్ కాబోయే భర్త శివ్, గుప్పేదేంత సీరియల్ హీరో ముకేశ్ గౌడ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.
అత్యంత ఆసక్తికరంగా ఉన్న విషయం ఏంటంటే — యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ 9లో పాల్గొననున్నారని బలమైన ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ఆదివారం లాంచ్ ఎపిసోడ్ తర్వాత అసలు జాబితా బయట పడనుంది. అప్పటివరకు ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం పెరుగుతూనే ఉంది.