గడిచిన ఎన్నికల్లో సూపర్ 6 అంటూ హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలే నిరసన తెలుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని ఓ గ్రామంలో ఔత్సాహిక యువకులు చేసిన ఓ ఓవీడియో వైరల్ అవుతోంది.
గ్రామ కూడలి వద్ద చంద్రబాబు వేశంలో ఓ యువకుడు అచ్చం అదే వేషధారణతో ‘మందు తక్కువైందని ప్రశ్నించిన యువకుడికి.. ’ మందు ధర తగ్గిస్తానంటూ హామీలిచ్చాడు.
ఇక సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే వచ్చే దీపావళి .. లేదంటే ఆ తర్వాత వచ్చే దీపావళి అంటూ పొడిగించుకుంటూ వెళ్లిపోయాడు. హామీల అమలు మాత్రం ఇప్పట్లో కాదంటూ సెటైర్లు వేశారు.
తిరుపతిలో బాంబులే తనను ఏం చేయలేకపోయాయని.. ఈ ప్రతిపక్షాలు, ప్రజలు ఏం చేస్తారంటూ దెప్పిపొడుస్తున్న ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ’ అంటూ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.