Top Stories

ఇట్లు మీ జెండా కూలీ

 

అన్నా.. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు వింటుంటే నవ్వాపుకోలేకపోతున్నా!” అంటూ తనదైన యాసలో మొదలుపెట్టాడు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు. పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ వ్యాఖ్యలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“గతంలో చంద్రబాబు నాయుడు గారికి వయసైపోయిందని, ఆయన రెస్ట్ తీసుకోవాలని చెప్పింది ఈయనే కదా! మరి ఇప్పుడు ఏమైందో.. ఆయన్ని పట్టుకునే డిప్యూటీ సీఎం అయిపోయాడు. అప్పుడు చెప్పిన మాటలేమో గాలికి కొట్టుకుపోయాయి” అంటూ పవన్ కళ్యాణ్ గతంలోని వ్యాఖ్యలను గుర్తు చేశాడు ఆ యువకుడు.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరింత ఘాటుగా స్పందించాడు. “ఈనాడు వచ్చే ఎలక్షన్ కోసం కాదంటా.. వచ్చే తరం కోసం కొనసాగాలంటా! అంటే ఏమిటన్నా ఇది? పదవి కావాలనే కోరిక స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడేమో వయసైపోయిందని చెప్పడం.. ఇప్పుడేమో తరాల గురించి మాట్లాడటం.. ఏమి లాజిక్ ఇది?” అంటూ ప్రశ్నించాడు.

పవన్ కళ్యాణ్ తరచూ తన పార్టీ నిలబడిందని, 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని తామే నిలబెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆ యువకుడు ఎద్దేవా చేశాడు. “మొన్నేమో టీడీపీని మనమే నిలబెట్టామన్నారు. మరి ఈరోజు ఏమో ‘మాకు సత్తా లేకనే చంద్రబాబు మద్దతు ఇచ్చాం’ అంటున్నారు. అంటే ఏమిటన్నట్టు? ఒకసారి నిలబెట్టామంటారు.. మరోసారి సత్తా లేదంటారు. ఆయన మాటలకే ఆయనకు క్లారిటీ ఉందో లేదో అర్థం కావడం లేదు” అంటూ చమత్కరించాడు.

“నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను. సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశాను’ అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడాన్ని ఆ యువకుడు మరింత సెటైరికల్‌గా వ్యాఖ్యానించాడు. “సత్తా లేనప్పుడు సపోర్ట్ చేశారట! మరి అంతకుముందు టీడీపీని నిలబెట్టామని చెప్పింది ఊరికేనా? సత్తా లేదని తెలిసినప్పుడు అంత పెద్ద మాట ఎందుకు చెప్పారో ఆయనే చెప్పాలి” అంటూ తనదైన గోదావరి యాసలో పవన్ కళ్యాణ్ మాటలను తప్పుబట్టాడు.

మొత్తానికి ఈ యువకుడి సెటైర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాటల్లోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ అతడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ విమర్శలకు ఎలా స్పందిస్తారో చూడాలి.

https://x.com/Neninthae_/status/1906701756555489761

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories