Top Stories

నీతులు చెప్పే ఏబీఎన్ ఆర్కే అసలు రూపం ఇదీ.!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక మీడియా సంస్థ అధిపతి నిత్యం సమాజ ఉద్ధరణ గురించి అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. తాను మాత్రమే ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను అన్నట్టుగా సదరు మీడియా సంస్థ యజమాని వ్యవహార శైలి ఉంటుంది. అయితే, సదరు మీడియా సంస్థ యజమాని చేసే పనికి, చెప్పే మాటలకు పొంతనే ఉండదు. ఆయనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల యజమాని వేమూరి రాధాకృష్ణ. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎదుటివారి ఇళ్లల్లో ఏం జరిగిందో చెప్పేందుకు తాపత్రయపడే రాధాకృష్ణ.. తన సంస్థలో జరుగుతున్న విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగులకు కనీస స్థాయిలో జీతాలను ఇవ్వలేని ఆయన.. ఇతరుల గురించి మాత్రం బాగానే చెబుతుంటారు. ఈ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు లైన్ ఎకౌంటు సరిగా ఇవ్వరనే అపవాదు ఉంది. ఒకవేళ ఇచ్చిన అది పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవు. ఇక ఆ సంస్థ లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్లు పేరుతో వేధింపులకు గురి చేస్తుంటారు. రిపోర్టర్లను వార్షిక చందాలు బుక్ చేయాలని కొన్ని నెలలపాటు ఇబ్బందులకు గురిచేస్తుంటారు. వార్షిక చందాల ప్రక్రియను ఎలాగోలా పూర్తి చేశామని గుండెల మీద చేయి వేసుకునేసరికి.. వార్షికోత్సవ ప్రకటనల టార్గెట్ రిపోర్టర్ల ముందు పడుతుంది. లక్షలాది రూపాయలు యాడ్స్ చేస్తేనే గాని ఒప్పుకోను పరిస్థితి ఆ యాజమాన్యానిది. జిల్లా మేనేజర్లు ఆయా రిపోర్టర్లను లక్ష్యాలు చేరుకోవాలంటూ వేధిస్తుంటారు.

గడిచిన నెల రోజులుగా వార్షికోత్సవానికి సంబంధించిన తతంగం జరుగుతోంది. నెల రోజుల నుంచి కింద మీద పడుతున్న యాజమాన్యం విధించిన లక్ష్యంలో 50 శాతాన్ని కూడా చేరుకోలేకపోయారు. రెండు రాష్ట్రాల్లోనూ సదరు మీడియా సంస్థ యజమానికి అనుకూలమైన ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ ఆశించిన స్థాయిలో లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఒకంత అసహనాన్ని యాజమాన్యం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి వార్షికోత్సవ ప్రకటనల గొడుగును మరో 15 రోజులు పాటు పెంచినట్లు తెలిసింది. ఈ గడువులోగా మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవాలని రిపోర్టర్లకు ఆదేశాలు ఉన్నత స్థాయి నుంచి వచ్చాయి.

ఒకవైపు సర్కులేషన్, మరోవైపు యాడ్స్ టార్గెట్లను చేరుకోలేక ఎంతో మంది రిపోర్టర్లు బయటకు వచ్చేస్తున్నారు. కొందరు మాత్రం అందులోనే ఉండి ఈ బాధలను పడుతూనే ఉన్నారు. యాడ్స్ ఇవ్వకుంటే ఆ పత్రికలో వచ్చే కథనాలు వేరేగా ఉంటాయి అన్న ప్రచారం బయట ఉంది. పెద్దగోలుగా వార్తలు రాస్తూ ఇబ్బందులకు గురిచేస్తారన్న ఉద్దేశంతో చాలామంది ప్రకటనలు ఇస్తుంటారు. ఆ పత్రికలో వాడే భాష కూడా ఎబ్బెట్టుగానే ఉంటుందే అని పలువురు పేర్కొంటుంటారు. లైన్ అకౌంట్ అడిగితే వేధింపులకు గురి చేస్తుంటారని, తీరా వార్షికోత్సవాల సందర్భంగా మాత్రం లక్షలాది రూపాయలు ప్రకటనలు వేయాలంటూ ఒత్తిడి చేస్తుంటారంటూ పలువురు రిపోర్టర్లు వాపోతున్నారు. ఇదే విషయంపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తెల్లారి లేచిన దగ్గర్నుంచి నీతులు చెప్పే రాధాకృష్ణ ఇదా నీ అసలు రూపం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories