Top Stories

కొడాలి నానికి బాబు నేర్పిన హుందాతనం ఇదే.. వైరల్ వీడియో

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు, చేసే చేష్టలకు పొంతనే ఉండదు. ఆయన ఒకటి చెబితే.. దానికి విరుద్ధంగా మరొకటి చేస్తుంటారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని నోటు దురుసుతో మాట్లాడుతున్నాడు అంటూ టిడిపి నేతలు ఆయనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఒకరకంగా చెప్పాలంటే కావాలనే కొడాలి నానిపై ఒక రకమైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ, కొడాలి నానికి 100 తో కూడిన రాజకీయాలను చేయడం బాబే నేర్పించాడు అంటూ ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు నుంచే కొడాలి నాని హుందాగా మాట్లాడడం నేర్చుకున్నారంటూ పలువురు పేర్కొంటుంటారు. ‘మీరు నేర్పిన విద్యేయే నీరజాక్ష’ అన్న చందంగా టిడిపి నేతల మాటల నుంచే కొడాలి నాని దూకుడు అయిన మాట తీరును అలవర్చుకున్నారంటూ పలువురు చెబుతున్నారు.

ఇందుకు ఉదాహరణగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టిడిపి నేతలు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వీడియోను ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఇన్నన్ని మాటలు మాట్లాడిన మీరా గతంలో నంగనాచి కబుర్లు చెప్పింది అంటూ వీడియోను చూసిన ఎంతోమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. గతంలో తమ పార్టీకి చెందిన నేతలు నోరు పారేసుకున్నప్పుడు ఈ మాటలు ఎక్కడికి పోయాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నోరు ఉందని విచ్చలవిడిగా నోరు పారేసుకుంటే హుందాతనం కాదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించగా.. చంద్రబాబు నేర్పిన హుందాతనంతోనే పడాలి నాని వంటి నేతలు మాట్లాడారంటూ పలువురు పేర్కొంటున్నారు.

సాధారణంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు మరో విధంగా మాట్లాడుతుంటారు. అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మీ కథ ఏంటో తేలుస్తామంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. అదే ప్రతిపక్షంలో ఉండగా మాత్రం హుందాగా ఉండాలంటూ సూక్తులు చెబుతుంటారు. అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమ, కింజరాపు అచ్చం నాయుడు వంటి నేతలు మాట్లాడిన మాటల్లో హుందాతనం ఎక్కడ ఉంది బాబు గారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ‘ఏంట్రా అరేయ్.. ఏంట్రా అరేయ్, పాతేస్తారా.. నా కొడకా’ అంటూ వ్యాఖ్యానించినప్పుడు అదే సభలో ఉన్న చంద్రబాబు నాయుడు అలా మాట్లాడడం కుందాతనం కాదంటూ ఎందుకు నిలువరించలేదు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే అసెంబ్లీలో మరో మంత్రి కింజరాపు అచ్చం నాయుడు.. మగతనం ఉంటే అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను పలువురు గుర్తు చేస్తున్నారు.

అసెంబ్లీలో ఎంత హుందాతనంగా మాట్లాడారు అంతే హుందాతనంగా కొడాలి నాని వంటి నేతలు మాట్లాడారని. మీరు నేర్పిన హుందాతనం మీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎందుకు బాధపడుతున్నారు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడకూడని మాటలు మాట్లాడిన టిడిపి నేతలే కొడాలి నాని వంటి వైసీపీ నేతలకు ఆదర్శప్రాయంగా నిలిచారని అని పలువురు చెబుతున్నారు. టిడిపి నేతలు చేస్తే సంసారం.. మిగిలిన పార్టీలకు చెందిన నాయకులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా తయారైంది టిడిపి పరిస్థితి అంటూ పలువురు పేర్కొంటున్నారు. దీనికి గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు, టిడిపి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రెచ్చిపోయి మాట్లాడిన మాటలు వీడియోలను చూపిస్తున్నారు. సుద్దులు చెప్పడానికి బాగుంటాయని, ఆచరించడానికి మాత్రం అక్కరకు రావని టిడిపి నేతలు చెప్పకనే చెబుతున్నారంటూ పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కొడాలి నాని కి బాబు టిడిపి నేతలు నేర్పిన హుందాతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories