Top Stories

వైసీపీకి భారీ ఊరట- ఆయనకు విపక్ష నేత హోదా..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిస్ధితుల్లో అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల మేరకు అసెంబ్లీలో 10 శాతం సభ్యులు ఉన్న పార్టీకే విపక్ష నేత హోదా ఇస్తామని చెబుతోంది. దీంతో కేవలం 11 మంది ఎమ్మెల్యేల్ని గెల్చుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తింపు పొందుతున్నారు.

ఈ తరుణంలో వైసీపీకి శుభవార్త అందింది. అసెంబ్లీలో తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదన్న కారణంతో విపక్ష నేత ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నా.. మండలిలో మాత్రం మెజార్టీకి మించి ఎమ్మెల్సీల బలం ఉన్న ఆ పార్టీకి విపక్ష నేత హోదా దక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో విపక్ష నేతగా గుర్తిస్తూ ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ పేరిట సోమవారం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

మరోవైపు శాసనసభలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఇప్పటివరకూ అసెంబ్లీలో సభ్యులకు స్పీకర్ సీట్ల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో సభ్యులు తమకు నచ్చిన చోట కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీ పరిస్ధితి మెరుగ్గా కనిపిస్తోంది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories