Top Stories

తిరుమలలో మరో అపచారం

ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నడిచి వెళ్లే అత్యంత పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహార విందు కలకలం రేపింది. శ్రీవారి కొండపైనా, మెట్ల మార్గంలోనూ మాంసాహారం, మద్యం వినియోగం పూర్తిగా నిషేధం అయినప్పటికీ, ఇటీవల కొందరు మెట్ల మార్గంలో బహిరంగంగా చేపల కూర/మాంసాహారం తింటూ వీడియోలకు చిక్కడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీరుపై, ముఖ్యంగా విజిలెన్స్ విభాగంపై భక్తులు, హిందూ ధార్మిక సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీటీడీని నిలదీస్తున్న భక్తులు

నిషేధిత ఆహారం ఎలా తిన్నారు? పవిత్రమైన మెట్ల మార్గంలో, భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన వారు నిషేధిత మాంసాహారం తినడం ఏమిటని భక్తులు నిలదీస్తున్నారు. విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా? తిరుమల పవిత్రతను కాపాడాల్సిన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం ఇటువంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి అపచారాలు జరిగినప్పటికీ, అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఇవి పునరావృతం అవుతున్నాయని మండిపడుతున్నారు.

ఛైర్మన్ గారూ.. మీ స్పందనేంటి? టీటీడీ చైర్మన్ బొల్లినేని నాయుడు గారు ఈ వరుస అపచారాలపై ఏమి సమాధానం చెప్తారని, భ్రష్టు పడుతున్న టీటీడీ పరువును కాపాడేందుకు ఏం చర్యలు తీసుకుంటారని సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై విమర్శలు పెరగడంతో టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు. అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం తిన్న ఇద్దరు ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు రామస్వామి, సరసమ్మ విధుల్లో నుంచి తొలగించినట్లు టీటీడీ ప్రకటించింది. అంతేకాకుండా వారిపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ చర్య తాత్కాలికమేనా, లేక తిరుమల పవిత్రతకు భంగం కలిగించే వారికి కఠిన సందేశం ఇస్తుందా అనేది వేచి చూడాలి. టీటీడీ కేవలం ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం కాకుండా, పవిత్రతను కాపాడేందుకు విజిలెన్స్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

https://x.com/JaganannaCNCTS/status/1987787947811463504?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories