తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మళ్లీ వివాదంలో చిక్కుకుంది. పరకామణిలో జరిగిన చోరీ, కోట్ల రూపాయల కుంభకోణ ఆరోపణలు రాజకీయ రచ్చకు దారి తీస్తున్నాయి. రవికుమార్ అనే గుమాస్తా సంవత్సరాలుగా విదేశీ కరెన్సీని పక్కదారి పట్టించాడనే విషయం బయటపడింది. 2023లో 900 డాలర్లు అపహరించిన ఘటనతో ఈ వ్యవహారం బహిర్గతమైంది. ఆయన కోట్లకు పడగలెత్తే ఆస్తులను కూడగట్టాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక రాజకీయ రంగంలో ఈ ఘటన వేడెక్కింది. ఈ కుంభకోణం 300 కోట్ల రూపాయల దాకా ఉందని ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణ ప్రారంభమైంది.
ఈ వివాదాలు భక్తులలో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ సమర్పణలు సురక్షితం కావాలని, నిజాలను బయటపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోట్లాది మంది శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.