Top Stories

వైరల్‌గా ‘తోపుదుర్తి’ వీడియోలు

 

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ రాప్తాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. దాన్ని టీడీపీ శ్రేణులు వావివరసలు మరిచి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ వీడియోలో తోపుదుర్తి విమానాశ్రయంలో హీరోయిన్ సుమయరెడ్డి భుజంపై చేయి వేసి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారితీసింది. పలువురు నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

అయితే, ఈ వీడియోపై వస్తున్న ప్రచారాన్ని తోపుదుర్తి , హీరోయిన్ సుమయరెడ్డి ఇద్దరూ తీవ్రంగా ఖండించారు. తమపై జరుగుతున్నది దుష్ప్రచారమని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తోపుదుర్తి మాట్లాడుతూ, సుమయరెడ్డి తమ బంధువుల అమ్మాయి అని తెలిపారు. కొందరు నీచ రాజకీయాలు చేస్తూ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

మరోవైపు, సుమయరెడ్డి కూడా ఈ వీడియోపై స్పందించారు. తోపుదుర్తి తమకు కుటుంబ సభ్యుడని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆమె కొట్టిపారేశారు.

జగన్ రాప్తాడు పర్యటనకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార పార్టీ నేతకు సంబంధించిన వీడియో వైరల్ కావడం, దానిపై ఆయన ,సంబంధిత వ్యక్తి వివరణ ఇవ్వడంతో టీడీపీ కుట్రలు బట్టబయలు అయ్యాయి.. రాప్తాడులో జగన్ పర్యటన సందర్భంగా ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

 వీడియో

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories