అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులను, టెక్ కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసే H-1B వీసా ఫీజు పెంపు అంశంపై ఇండియన్ మీడియా కూడా ఘాటు స్పందన వ్యక్తం చేస్తోంది.
తెలుగు మీడియా రంగంలో ప్రముఖులు టీవీ5 యాంకర్ సాంబశివరావు, ఏబీఎన్ వెంకటకృష్ణ ట్రంప్ విధానాలను కఠినంగా విమర్శిస్తూ నేరుగా యుద్ధం ప్రకటించారు. “ఈ నిర్ణయం కేవలం అమెరికాలో ఉద్యోగాలను కాపాడటానికే కాదు, విదేశీయులపై వివక్ష చూపించే ప్రయత్నం కూడా” అని వీరిద్దరూ వ్యాఖ్యానించారు.
టీవీ5 సాంబా తన డిబేట్స్‌లో మాట్లాడుతూ “అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేది వలసదారుల కృషి. వారిని దూరం చేస్తే అమెరికా కూలిపోవడమే తప్ప ఎదగదు” అని ట్రంప్‌ను హెచ్చరించారు.
అదేవిధంగా ఏబీఎన్ వెంకటకృష్ణ మాట్లాడుతూ “ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా యుద్ధ ప్రకటనే. ఇది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా భారతీయ ఐటీ రంగాన్ని బలహీనపరచే ప్రయత్నం” అని వ్యాఖ్యానించారు.
ఈ ఇద్దరి ఘాటైన విమర్శలతో, ముందస్తు జాగ్రత్త చర్యగా ట్రంప్ ప్రభుత్వం అమెరికా భూభాగంలో “యెల్లో మీడియా”గా పేరుపొందిన కొన్ని భారతీయ టీవీ ఛానెల్స్ ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేసిందని సమాచారం.
ఇక ఈ పరిణామం తెలుగు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికలపై “సాంబా వర్సెస్ ట్రంప్”, “వెంకటకృష్ణ వర్సెస్ వైట్ హౌస్” అంటూ మీమ్స్, పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి ట్రంప్ నిర్ణయాలపై తెలుగు మీడియా స్వరం మరింత గట్టిగా వినిపిస్తోంది. ఇకపై అమెరికా-భారత్ సంబంధాల దిశ ఏవైపు వెళుతుందన్నది చూడాల్సిందే.