తుఫాన్ వస్తే సాధారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వార్తలు చెప్పే కొందరు మాత్రం దాన్ని “ఒక అవకాశం”గా చూస్తారు. అలానే టీవీ5 జర్నలిస్ట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
తుఫాన్ గాలులు బలంగా వీచుతున్న వేళ, ఆ జర్నలిస్ట్ లైవ్‌లోకి వెళ్లి “గాలి ఎంత వేగంగా వీస్తోందో చూడండి” అంటూ కెమెరా ముందు ఫోజులు కొట్టాడు. వాన, గాలి, గొడుగు అన్నీ ఎగిరిపోతున్నా కూడా ఆయన ఆగలేదు. “ఇది మా ధైర్యం” అనే తరహాలో రిపోర్టింగ్ చేస్తూ ఓవరాక్షన్ చేశాడు.
కానీ నెటిజన్లు మాత్రం ఈ దృశ్యాలను చూసి ఒక్కటే చెబుతున్నారు.. “ఒరే టీవీ5, అందుకే నిన్ను ట్రోల్ చేస్తాం బాబూ!” అని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. “అక్కడికి వెళ్లి మైక్ పెట్టి మరి ఏం చూపిస్తావు రా?” “ప్రజల ప్రాణాల మీద షో చేయొద్దు.” “ఓవరాక్షన్ కంటే సేఫ్టీ ముఖ్యం.” అంటూ చాలామంది సెటైర్లు వేస్తున్నారు.
మీడియా అంటే బాధ్యత. ప్రజలకు నిజమైన సమాచారం అందించడం ఒకవైపు, తమ ప్రాణాల పట్ల జాగ్రత్తగా ఉండడం మరోవైపు. కానీ సెన్సేషన్ కోసం సెన్స్ మరిచిపోయే ఈ రిపోర్టింగ్ స్టైల్ వల్లే టీవీ5 మళ్లీ ట్రోల్ బారిన పడింది.

