Top Stories

Venu Swamy : టీవీ5 మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. వేణు స్వామి సెన్సేషనల్ వీడియో రిలీజ్

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వీడియోను రిలీజ్ చేశారు. మీడియా ముసుగులో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వేణుస్వామి, ఆయన భార్య ఆరోపించారు.టీవీ5 టీమ్ తమ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని టీవీ5 మూర్తి వేధిస్తున్నాడని వేణుస్వామి వీడియో రిలీజ్ చేసి సంచలన ఆరోపణలు చేశారు.. సంబంధిత టెలిఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ కూడా విడుదల చేశారు.. వేణుస్వామి, వీణా శ్రీవాణి లను TV5 మూర్తి , అతని బృందం 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వేణుస్వామి సంచలన ఆరోపణలు చేశారు.

వేణుస్వామి ఈ మేరకు వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. ‘టీవీ5 జర్నలిస్టు మూర్తి గతంలో మహాటీవీలో పనిచేసేవారు. ఆ తర్వాత నాపై దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో, అతను నన్ను నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మూర్తి అడిగిన డబ్బు నేను ఇవ్వలేదు. కానీ చాలా రోజుల తర్వాత మూర్తి మరియు అతని బృందం నన్ను డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టారు. పథకం ప్రకారం టీవీ5లో నాపై డిబేట్ నిర్వహించి తప్పుడు ప్రచారం చేశాడు.’ అని వేణుస్వామి ఆరోపించారు.

ఎన్నో కష్టాలు పడి చివరకు మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చాను. వాళ్లు పెడుతున్న చిత్రహింసలు భరించలేకపోతున్నాను’ అని వేణుస్వామి ఆరోపించారు. జర్నలిస్ట్ మూర్తి ఆయన అనుచరుడు అమర్ బ్లాక్ మెయిల్ చేసిన ఆడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు వేణుస్వామి. దీనిలో తమ వద్ద రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఉంది.. ఈ విధంగా వచ్చే డబ్బు టీవీ5లో మూర్తి నుంచి చైర్మన్ నాయుడు వరకూ అందరూ పంచుకుంటారని చెప్పారు. ఆ ఛానల్ చైర్మన్ బి.ఆర్ నాయుడు దగ్గర్నుంచి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న వారందరూ పంచుకుంటారని చెప్పారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories