వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు. స్టూడియోలో స్తోత్రాలు పఠిస్తూ మొదలుపెట్టిన ఆయన, ఆ తరువాత నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏకంగా వార్నింగులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
భారత్‌పై సుంకాలు వేస్తున్న ట్రంప్‌ను ఉద్దేశించి “మా దేశం మా ఇష్టమండి.. మీరెవరు పన్నులు వేయడానికి?” అంటూ సూటిగా ప్రశ్నించేశారు సాంబ. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
మోడీ మాటనే వినని ట్రంప్, తనకు జిగ్రీ దోస్త్ అయినా భారత్ పై పన్నులు పెడుతుంటే, ఇక్కడ మన తెలుగు టీవీ యాంకర్ మాత్రం అమెరికా అధ్యక్షుడిని “బెదిరించేలా” వ్యాఖ్యలు చేయడం నెటిజన్లను నవ్విస్తోంది.
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో “సాంబ ట్రంప్‌కి వార్నింగ్ ఇచ్చేశాడు”, “మోడీ చెప్పలేకపోయిన మాటలు సాంబ చెప్పేశాడు”, “వినాయక చవితి పవర్ అంతే” అంటూ సెటైర్లు పడుతున్నాయి.
సాంబ శైలిలోనే చెప్పాలంటే “ఇకపై ట్రంప్ ఒక్కసారి పన్ను వేయాలంటే… ముందుగా టీవీ5 చూడక తప్పదు! సాంబ పర్మిషన్ తీసుకోక తప్పదు” అంటూ సెటైర్లు వేస్తున్నారు.