దేశ రాజకీయాల్లో ఓ వింత పరిస్థితి నెలకొంది. ప్రతి వ్యాఖ్య, ప్రతి మాట సోషల్ మీడియా యుగంలో క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
ఓ టెలివిజన్ డిబేట్‌లో మాట్లాడుతూ సాంబశివరావు “ఈ దేశంలో నీతి, నిజాయితీ కలిగిన పార్టీలు అంటే కేవలం బీజేపీ, ఎంఐఎం మాత్రమే” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే ట్రోల్స్ ఊచకోత మొదలైంది.
సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువ
ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ కామెంట్ సెక్షన్లు ఎక్కడ చూసినా సాంబశివరావుపై మీమ్స్, వ్యంగ్యాలు కురుస్తున్నాయి.”కొంపదీసి నీ ఆఫీస్ ముందు బీజేపీ వాళ్లను రమ్మని ఛాలెంజ్ చేస్తావా?” అని ట్రోలర్స్ తిట్టిపోస్తున్నారు. “అంత నీతిమంతులైతే, నిజాయితీగలవారైతే బీజేపీ, ఎంఐఎం ఎందుకు వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి?” అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
రాజకీయ నేతల నుంచి కౌంటర్లు
వైసీపీ నేతలు కూడా ఈ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. “జర్నలిస్ట్ పేరు మీద కప్పుకుని బీజేపీకి ప్రచారం చేస్తున్నారా?” అని ప్రశ్నిస్తున్నారు. “మీ నిజాయితీని మేము బాగా తెలుసు” అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
సాంబశివరావు మాటలను తీసుకుని మీమర్స్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఎంఐఎం, బీజేపీ ఫొటోలతో ఫన్నీ డైలాగులు జోడించి సొషల్ మీడియాలో పంచిపడేస్తున్నారు. “టీవీ5 సాంబ = బీజేపీ ఆఫీసియల్ స్పోక్స్ పర్సన్?” అనే మీమ్ కూడా వైరల్ అవుతోంది.
ఒక జర్నలిస్ట్ అభిప్రాయం సోషల్ మీడియాలో ఎంత హడావుడి రేపుతుందో మరోసారి స్పష్టమైంది. సాంబశివరావు ఉద్దేశపూర్వకంగానే అన్నారా? లేక వాదనలో భాగంగా జారిపోయారా? అన్నది పక్కన పెడితే… నెటిజన్లు మాత్రం ఆయనను ఓ రేంజ్‌లో ఆడుకుంటూ వదిలేలా లేరు.