టీవీ5 యాంకర్ సాంబశివరావు మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన ఇటీవల నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత నెటిజన్లకు విసిరిన సవాల్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.
లోకేష్ క్రీడారంగంలో చూపుతున్న గొప్పతనాన్ని జాకీలు పెట్టి లేపుతూ సాంబశివరావు చేసిన కామెంట్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. దీనిపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన మరో వీడియోతో ముందుకొచ్చారు. లోకేష్ గొప్పతనాన్ని టీమిండియా క్రీడాకారిణి శ్రీచరణి గొప్పగా చెప్పిందని ప్రస్తావించారు. తాను చెబితే ట్రోల్స్ చేశారని, దమ్ముంటే ఇప్పుడు శ్రీచరణి చెప్పినదాన్ని ట్రోల్ చేయండని ఏకంగా తొడగొట్టి సవాల్ విసిరారు.
“నేను ఇలా అంటే ట్రోల్స్ చేస్తున్నారంటూ.. దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి. లోకేష్ గొప్పతనాన్ని టీమిండియా క్రీడాకారిణి శ్రీచరణి గొప్పగా చెప్పింది. కమాన్ ఇప్పుడు శ్రీచరణి చెప్పినదాన్ని ట్రోల్ చేయండి చూద్దాం” – సాంబశివరావు
ఈ వ్యాఖ్యలు లోకేష్‌కు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పట్ల ఆయనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూనే, తనను ట్రోల్ చేసే నెటిజన్లను ఉద్దేశించి ఈ సవాల్ చేసినట్లు తెలుస్తోంది.
సాంబశివరావు చేసిన ఈ సవాల్‌ను నెటిజన్లు తేలికగా తీసుకోలేదు. ఆయన వీడియోను, ఆయన మాటలను ట్రోల్ చేస్తూ, కౌంటర్లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
కొందరు నెటిజన్లు సాంబశివరావు వ్యాఖ్యల్లోని అతిశయోక్తిని ఎత్తి చూపుతూ మీమ్స్‌తో స్పందిస్తున్నారు.
మరికొందరు, ఒక జర్నలిస్ట్‌గా ఉండాల్సిన నిష్పాక్షికతను వదిలేసి, ఒక రాజకీయ నాయకుడికి మద్దతుగా ఈ స్థాయిలో మాట్లాడటం సరికాదంటూ విమర్శిస్తున్నారు.
ఇంకొందరు, శ్రీచరణి గొప్పగా చెప్పిందనడానికి ఆధారం ఏమిటని, ఒక క్రీడాకారిణిని ఈ వివాదంలోకి లాగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
https://x.com/karnareddy4512/status/1990610929768411373?s=20


