టీవీ5 ఛానెల్‌లో యాంకర్ సాంబశివరావు పాల్గొన్న ఒక వీడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి, ముఖ్యంగా యూకే వైసీపీ అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి చింతలను టార్గెట్ చేస్తూ సాంబశివరావు ‘ఎల్ ముండల’ అంటూ రెచ్చిపోయి సవాల్ చేసినట్టుగా ఆ వీడియో ఉంది.
తాజాగా వైరల్ అయిన ఈ వీడియోలో సాంబశివరావు తీవ్ర పదజాలంతో మాట్లాడడం, తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సవాల్ విసరడం కనిపిస్తుంది. ఈ వీడియోను నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేయడంతో, యూకేలో ఉండే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతల దీనిపై స్పందించారు.
సాంబశివరావు సవాల్‌పై యూకే డాక్టర్ ప్రదీప్ రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన వివరణతో ఈ వివాదం పాతదేనని తేలింది. డాక్టర్ ప్రదీప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ వైరల్ అవుతున్న వీడియో ఏడాది కిందట తనకు, టీవీ5 సాంబశివరావు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించినది. ఆ సమయంలోనే ఈ అంశంపై పెద్ద రచ్చ జరిగిందని, దానిపై అప్పుడే చాలా చర్చ జరిగిందని ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మళ్లీ ఆ పాత వీడియోను వైరల్ చేసి తనకు పంపడంపై… “అప్పుడే చాలా రచ్చ జరిగింది కాబట్టి, దానిపై ఇప్పుడు మళ్లీ స్పందించాల్సిన అవసరం లేదంటూ” ఆయన క్లారిటీ ఇచ్చారు.
చివర్లో, డాక్టర్ ప్రదీప్ రెడ్డి సెటైర్ వేస్తూ… “తనను తానే L ముండల అని పిలుచుకున్న సాంబా వీడియోపై క్లారిటీ” అంటూ తన వీడియోకు శీర్షిక పెట్టడం విశేషం. దీంతో, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక పాత వివాదానికి సంబంధించినదని, దానిపై మళ్లీ స్పందించే ఉద్దేశం లేదని డాక్టర్ ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు.
https://x.com/DrPradeepChinta/status/1995444928965386615?s=20


