వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. తాజాగా నమోదైన కేసులో అరెస్టు తప్పదన్న పరిస్థితుల్లో కొద్దిరోజులు పరారీలో ఉన్న వంశీ, కోర్టు రక్షణ లభించడంతో బయటకు వచ్చారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీనీ ధీటుగా ఎదుర్కొన్న వంశీ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ప్రభుత్వం మారిన తర్వాత కక్షగట్టి కూటమి ప్రభుత్వం జైలుకు పంపడంతో జైలు జీవితం అనుభవించారు. రాజకీయ ఫిరాయింపులు, తీవ్రమైన విమర్శల నేపథ్యంలో ఆయన పరిస్థితి మారింది. ముఖ్యంగా ఎన్. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనపై ఈ ప్రతీకారానికి కారణమయ్యాయి.
కోర్టు ఇచ్చిన ఉపశమనం వంశీ భారీ ఊరట. కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా మారింది. ఇది పూర్తి స్వేచ్ఛ అని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార దర్పంతో విర్రవీగితే రేపు కూటమి ఓడిపోయి వైసీపీ గెలిచాక పరిస్థితులు మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


