గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గత నెల 17న మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించడం ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆయన సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి ఉండటంతో, పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన వంశీ, ఇప్పుడు మళ్లీ కొత్త కేసులో చిక్కుకోవడంతో గన్నవరం రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

