మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న ఆయన, తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంలో ప్రధాని మోదీతో ఏకాంత భేటీ, ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో సమావేశాలు జరపడం చర్చనీయాంశమైంది.
బిజెపిలో సుదీర్ఘకాలం పనిచేసి, జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన వెంకయ్య నాయుడు, సమస్యలను పరిష్కరించే ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆయన సలహా అవసరమైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఉపరాష్ట్రపతి పదవి లేదా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి – ఏదో ఒక బాధ్యత ఆయనకు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం బలపడుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో, కొత్త నేతను ఎంపిక చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలో వెంకయ్య నాయుడు మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయాల్లో ఆయన రీ-ఎంట్రీతో బిజెపి-ఆర్ఎస్ఎస్ లెక్కలు ఎలా మారతాయో చూడాలి.