సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే పరంకుశం వేణు అలియాస్ వేణు స్వామి మరోసారి చర్చకు కేంద్రబిందువయ్యారు. ఇటీవల అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో ఆయనకు ప్రవేశం నిరాకరించడంతో వివాదాల్లో చిక్కుకున్న వేణు స్వామి, ఇప్పుడు విదేశాల్లో విహరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.
పసుపు రంగు టీ షర్ట్‌లో లగ్జరీ ట్రైన్లలో ప్రయాణం చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్న వేణు స్వామి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఎదుటివారి జీవితం మీద వేలుపెట్టి చివరికి ఇలా ఎంజాయ్ చేస్తున్నావా?” అని కొందరు ప్రశ్నిస్తే, “పసుపు రంగు కాబట్టి ఏదైనా రాజకీయ పార్టీ లోకి వెళ్ళబోతున్నావా?” అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఈ వీడియోపై కొందరికి వేణు స్వామి స్వయంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, చాలామందికి స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. మొత్తంగా ఆయన తాజా వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.