Top Stories

వైసీపీలోకి వర్మ 

పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భూకంపం రేపే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కు గట్టి షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ వర్మ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు బహిరంగం కావడం, అలాంటి సమయంలో వర్మ ముద్రగడను కలవడం పలు అనుమానాలకు తావు కలిగించింది. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గతంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వర్మ వైసీపీ చేరికపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వర్మను వైసీపీలోకి ఆహ్వానించేందుకు ముద్రగడ కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఈ బహిరంగ రాజకీయ మార్పులు ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ పోటీ కారణంగా టీడీపీ, జనసేన మధ్య అసంతృప్తి పెరుగుతుండటం, వర్మ వంటి సీనియర్ నేతలు తమ భవిష్యత్‌ను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రావడం సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సర్వేకూడా పిఠాపురంలో వర్మకు బాగా పేరుందని.. ఆయన గెలుస్తారని.. పవన్ ఓడిపోతారని పేర్కొన్నాయి.

ముద్రగడను కలిసిన వర్మ నిజంగానే వైసీపీలోకి వెళ్తారా? లేక కేవలం ఆత్మీయత కోసమే ఈ భేటీ జరిగిందా? అనేది త్వరలోనే తేలనుంది. అయితే ఈ పరిణామాలు మాత్రం పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ గా మారడం ఖాయం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. https://x.com/bigtvtelugu/status/1965399798590390593

Trending today

ఏపీలో ‘రెడ్డి’.. తెలంగాణలో ‘రావు’.. కులాల మద్దతేదీ?!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో...

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

Topics

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

Related Articles

Popular Categories