Top Stories

మాజీ మంత్రి విడదల రజిని గుడ్‌బై ? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి విడదల రజిని తీసుకునే తదుపరి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా? లేదా పార్టీ మారుతారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

విడదల రజిని 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే, 2024 ఎన్నికల్లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఈ మార్పు కారణంగా ఆమె అక్కడ ఘోర పరాజయాన్ని చవిచూశారు.

ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆమెను రేపల్లె నియోజకవర్గానికి వెళ్లమని ఆదేశించినట్లు సమాచారం. ఇది బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం. అయితే, పార్టీ అధినేత ఇచ్చిన ఈ ఆదేశాన్ని రజిని ససేమిరా అనడం వల్లే ఆమె పార్టీ మారుతారనే ఊహాగానాలు, టాక్ ఒక్కసారిగా ఊపందుకున్నట్లు తెలుస్తోంది. రజిని నిర్ణయంపై ఈ చర్చ మరింత బలం చేకూర్చింది. గతంలో కూడా ఆమె పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, రేపల్లె ఇన్‌ఛార్జి బాధ్యతలపై ఆమె మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ అంశంపై మాజీ మంత్రి విడదల రజిని ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఆమె మౌనం వెనుక పార్టీ మారుతున్నారా? లేక జగన్‌తో ఏర్పడిన అంతరాయం తాత్కాలికమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా లేకపోవడం, సోషల్ మీడియాలో కూడా కనిపించకపోవడంతో విడదల రజిని తదుపరి నిర్ణయం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories