వైసీపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని చెప్పిన విజయసాయిరెడ్డి… ఇప్పుడు మళ్లీ చురుకుగా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి విశాఖ పెట్టుబడుల సదస్సుపై స్పందిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక సూచన చేశారు.
పెట్టుబడుల అమలు వేగంగా జరగాలంటే, వాటికి సంబంధించిన అనుమతులు–పాలనాపరమైన పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆయన సూచించారు. కనీసం ప్రకటించిన పెట్టుబడుల్లో 75% అయినా అమలైతే రాష్ట్ర అభివృద్ధి దిశగా పెద్ద అడుగు పడుతుందని అభిప్రాయపడ్డారు.
విజయసాయిరెడ్డి సూచన రాజకీయపరంగా కాకుండా అభివృద్ధి కోణంలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ముఖ్య ప్రశ్న . ఈ సలహాను ముఖ్యమంత్రి చంద్రబాబు పాటిస్తారా? రాష్ట్ర అభివృద్ధికి ఈ సూచన ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
కఠిన పదజాలం నుంచి సౌమ్య ధోరణికి మారిన విజయసాయిరెడ్డి ఈ కొత్త సూచన… రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


